
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిసాన్ నగర్ సమీపంలోని పెట్రోల్ బంక్ లో డీజిల్ లో, పెట్రోల్ లో నీళ్లు కలిపారని వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. ఉదయం బంకులో డీజిల్ , పెట్రోల్ పోయించుకున్న సుమారు 50 మంది... బంకు దగ్గరికి వచ్చి ఆందోళన చేశారు. ఓ రైతు.. తన ట్రాక్టర్ లో డీజిల్ పోసుకుని పొలం పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా... తరచూ ఇంజిన్ ఆగిపోవడంతో అనుమానం వచ్చి డీజిల్ చూడగా అసలు విషయం తెలిసింది. సగానికి ఎక్కువ నీళ్లే ఉండటంతో... బంకు వద్దకు వెళ్లి నిర్వాహకులను నిలదీశాడు. అంతలోనే పలువురు అదే కారణంతో అక్కడికి చేరుకున్నారు. నీళ్లు పోసి డీజిల్ , పెట్రోల్ అమ్ముతున్నారని... వాహనాలు పాడయ్యాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంకు నిర్వాహకులు వారిపైనే గదమాయించి మాట్లాడటంతో... అధికారులకు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ బంకు వద్దకు వచ్చి డీజిల్ , పెట్రోల్ లో నీళ్లు కలిపారని నిర్ధారించుకుని... బంకును సీజ్ చేశారు.
#LatestNews
#EtvTelangana
0 Comments