స్వయంగా తాము ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులు అమలు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జైలులో ఉన్న కొందరు ముద్దాయిలకు ఈనెల 8న తాము మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులు అమలు కాకపోవడం పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మండిపడింది. ఉత్తర్వులు జైలు అధికారులకు అందకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం సమాచారం పంపేందుకు పావురాల కోసం ఎదురుచూస్తున్నామా అని ప్రశ్నించింది.
#LatestNews
#EtvTelangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments